అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో ధ్వంసమైన రోడ్లు

KMM: మధిర లడక్ బజారు పంపింగ్ వెల్కి వెళ్లే రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల కారణంగా ధ్వంసమై తీవ్ర సమస్యగా మారిందని స్థానికులు చెప్పారు. ఈ మార్గం రైతులు, కూలీలు, మహిళలు, పిల్లల రాకపోకలకు ముఖ్యమైనది. కానీ ప్రస్తుతం ద్విచక్రవాహనాలు, కాలినడక ప్రయాణం కూడా కష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.