మాచారెడ్డి చెక్‌పోస్ట్‌లో ఆకస్మిక తనిఖీ

మాచారెడ్డి చెక్‌పోస్ట్‌లో ఆకస్మిక తనిఖీ

KMR: జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మంగళవారం మాచారెడ్డి పోలీస్‌ స్టేషన్ పరిధిలోని చెక్‌పోస్ట్‌ను ఆకస్మికంగా పరిశీలించారు. వాహన తనిఖీలు, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది విధులను సమీక్షించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఎస్సైకి సూచించారు. ప్రజలు, వాహనదారులు తప్పనిసరిగా నియమాలు పాటించాలని ఎస్పీ తెలిపారు.