సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
MNCL: మంచిర్యాలలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో గురువారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ.. సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం సెల్ ఫోన్ వినియోగం పెరిగిపోవడాన్ని ఆసరాగా చేసుకుని డబ్బు ఆశ చూపి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.