మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య

SKLM: మద్యం మత్తులో ఒకరు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పొందూరు మండలంలో జరిగింది. రామదాసు పేటకు చెందిన పేడాడ అప్పలనాయుడు (57)తన కుటుంబంతో హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. వారం రోజుల క్రిందట స్వగ్రామానికి వచ్చిన ఆయన నిత్యం మద్యం సేవిస్తూ శనివారం ఉరివేసు కొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం సమాచారం రావడంతో పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశామన్నారు.