చంద్రబాబు పింఛన్లు పంపిణీ.. షెడ్యూల్ ఇదే!

చంద్రబాబు పింఛన్లు పంపిణీ.. షెడ్యూల్ ఇదే!

AP: సీఎం చంద్రబాబు ఎల్లుండి ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. గొల్లగూడెం చేరుకుని అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులతో భేటీ కానున్నారు. అనంతరం గోపీనాథపట్నం చేరుకుని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. తర్వాత నల్లమాడ ప్రజావేదిక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.