రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

కోనసీమ: పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లారీ వేగంగా వచ్చి సైకిల్‌పై వెళుతున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. వ్యక్తి ఒక్కసారిగా చక్రాల మధ్య పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రాజోలు మండలం తాటిపాక గంగయ్య కాలనీ చెందిన మద్దుల గోపాలం(70)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.