కృష్ణా వాటర్ పైపులైన్‌కు అడుగడుగునా లీకులు

NTR: జి. కొండూరు మండల పరిధిలో దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన కృష్ణా వాటర్ పైపులైను తుప్పు పట్టి అడుగడుగునా లీకులు ఏర్పడుతున్నాయి. రోజుకు 50 లక్షల లీటర్ల తాగునీరు సరఫరా అవుతున్న ఈ పైపులైను నుంచి లీకైన నీరు మరలా పైపుల్లోకి చేరి కలుషితమవుతోంది. చెకింగ్ పేరుతో తీసిన గుంతను పూడ్చకపోవడంతో ప్రజలు వ్యాధుల భారిన పడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించాలన్నారు.