అమరావతిని రాజధానిగా జగన్ వ్యతిరేకించలేదు: బొత్స
AP: మూలపేట పోర్టుకు రేపు వెళ్తున్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వైసీపీ హయాంలో 70 శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు. కూటమి ప్రభుత్వం పోర్టు పనులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా జగన్ వ్యతిరేకించలేదన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ది కోసమే 3 రాజధానులు అన్నారని స్పష్టం చేశారు.