VIDEO: బస్టాండ్‌లో ఆటో కార్మికులు నిరసన కార్యక్రమం
NLR: కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కలువాయి బస్టాండ్ లో ఆటో కార్మికులు మంగళవారం నిరసన తెలిపారు. 'తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు సేవ్ కలువాయి' అంటూ నినాదాలు చేశారు. తిరుపతిలో కలిస్తే ఎఫ్‌సీ, రిజిస్ట్రేషన్, లైసెన్సుల కోసం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుందన్నారు. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వాపోయారు.