'ప్రజల దప్పిక తీర్చేందుకే చలివేంద్రాలు'
MNCL: ప్రజల దప్పిక తీర్చేందుకు చలివేంద్రాలు ఉపయోగపడతాయని జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ అన్నారు. జన్నారం పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జన్నారంలోని ధర్మారం చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, సంఘం నాయకులు ఉన్నారు.