అంగన్వాడి టీచర్లకు సెల్ ఫోన్లు అందజేసిన MLA

అంగన్వాడి టీచర్లకు సెల్ ఫోన్లు అందజేసిన MLA

ADB: రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద అంగన్ వాడి టీచర్లకు అందజేస్తున్న 5G ఫోన్లను ఇవాళ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. నెరడిగొండ మండల కేంద్రంలో నియోజకవర్గంలోని బోథ్, సోనాల, ఇచ్చొడ, నెరడిగొండ, బజార్ హత్నూర్, సిరికొండ మండలాలకు చెందిన 289 మంది అంగన్ వాడి టీచర్లకు, సూపర్ వైజర్లకు, బ్లాక్ కోఆర్డినేటర్లకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.