ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
SRPT: నేరేడుచర్ల పట్టణంలో శుక్రవారం ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఎస్సై రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన ఏ ఆర్. డీఎస్పీ నరసింహ చారి, తహసీల్దార్ సైదులు గౌడ్ జండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను వారు కొనియాడారు.