'మంత్రి శ్రీధర్ బాబుపై ఆరోపణలు చేస్తే సహించేది లేదు'
PDPL: తెలంగాణ ప్రభుత్వం, మంత్రి శ్రీధర్ బాబుపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోమని కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు హెచ్చరించారు. గురువారం ప్రెస్ క్లబ్‌లో వారు మాట్లాడుతూ.. దళిత బంధు పేరుతో బీఆర్ఎస్ దళితులను మోసం చేసిందని, అంబేడ్కర్ పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.12 లక్షలు అందజేస్తుందని తెలిపారు. ఆరు గ్యారంటీలను ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు.