'ఎన్నికల కోడ్ ముగిసే వరకు ర్యాలీలు నిషేధం'
గద్వాల్ జిల్లాలో మూడు దశల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోనే కొనసాగుతుందని ఎస్పీ టీ. శ్రీనివాసరావు గురువారం పేర్కొన్నారు. ఎన్నికల తొలి దశలో ఫలితాలు ప్రకటించినప్పటికీ, గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు ఇప్పుడే విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు, బైక్ ర్యాలీలు, డీజేలు వంటి కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు.