నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
MNCL: లక్షెట్టిపేట మండలం సూరారం సబ్ స్టేషన్ పరిధి గ్రామాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని AE గణేష్ ప్రకటనలో తెలిపారు. సబ్ స్టేషన్‌లో కొత్త పవర్ ట్రాన్స్‌ఫార్మర్స్ ఏర్పాటు చేస్తున్నందున గుల్లకోట, పోతపల్లి, అంకత్పల్లి, సూరారం, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని పేర్కొన్నారు.