'రానున్న మూడు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు'

BPT: బాపట్ల జిల్లాలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ వెంకట మురళి సోమవారం తెలిపారు. రెవెన్యూ అధికారులు లోతట్టు ప్రాంతాలపై దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు.