వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

SRD: ఇంటినుంచి బయటకు వెళ్లిన వ్యక్తి ఫ్యామిలీ గ్రూప్‌లో మెసేజ్ పెట్టి అదృశ్యమైన ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... HMT కాలనీకి చెందిన శ్రీధర్ (24)కు నాలుగేళ్ల క్రితం గీతతో వివాహం జరిగింది. వీరి మధ్య గొడవపై సోమవారం పెద్దలు నచ్చ చెప్పారు. బయటకు వెళ్లిన శ్రీధర్ తిరిగి రాలేదు. తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.