'దళితుల సమస్యలు అధికారులకు పట్టడం లేదు'

'దళితుల సమస్యలు అధికారులకు పట్టడం లేదు'

గద్వాల జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరిగే నేరాలపై చర్యలు తీసుకోవడంలో జిల్లా అధికారులు జాప్యం చేస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇంఛార్జ్ మాచర్ల ప్రకాష్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యని భీమ్ ఆర్మీ నాయకులు ఫిర్యాదు అందించారు. చర్యలు తీసుకునేలా కృషి చేయాలన్నారు.