పంటలపై ఏనుగునుల దాడులు
CTR: పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు పంటలపై దాడులు కొనసాగుతున్నాయి. శనివారం వేకువజామున దేవలంపేట పంచాయతీలో ఏనుగు దాడి చేయడంతో వరి, కొబ్బరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. సుధాకర్, చిన్ని, గురుస్వామి, మల్లికార్జున్, శివరామయ్య, శంకర్ వంటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దాడి అనంతరం ఏనుగు అడవుల్లోకి వెళ్లిపోయింది.