VIDEO: సిద్దేశ్వరాలయంలో పూజలు
MDK: హవేలీ ఘనపూర్ మండలం ముత్తాయికోట గ్రామంలో పురాతన శ్రీ సిద్దేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకొని అభిషేకం నిర్వహించి, మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాగా, అర్ధరాత్రి వరకు స్వామివారికి పూజలు నిర్వహించనున్నారు.