విద్యార్థులకు బహుమతుల పంపిణీ

విద్యార్థులకు బహుమతుల పంపిణీ

అన్నమయ్య: వీరబల్లి మండల కేంద్రంలోని గ్రంథాలయంలో 58వ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు భాను గోపాల్ రాజు, ఎంఈవో వీరనాగయ్య చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు గ్రంథాలయాలు విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించే వేదికలని, పాఠశాల చదువుతో పాటు గ్రంథాలయాల వినియోగం మేలు చేస్తుందని తెలిపారు.