సొంత గడ్డపై ఆసీస్‌కు భారీ ఓటమి

ఆస్ట్రేలియాకు తొలి వన్డేలో సౌతాఫ్రికా భారీ షాక్ ఇచ్చింది. ఆసీస్‌ను వారి సొంత గడ్డపైనే 98 పరుగుల భారీ తేడాలో ఓడించింది. గడిచిన 34 ఏళ్లలో సొంత గడ్డపై ఆసీస్‌కు ఇది భారీ ఓటమి. మొదట బ్యాటింగ్ చేసిన SA 296/8 పరుగులు చేయగా.. AUS 198 రన్స్‌కు ఆలౌటైంది. SA బౌలర్ కేశవ్ మహారాజ్ 5 వికెట్లు తీసి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.