నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

MDK: కౌడిపల్లి మండలం వెంకట్రావు పేట, రాజిపేట విద్యుత్ సబ్ స్టేషన్‌లలో మరమ్మత్తుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ శరత్ ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వివరించారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.