VIDEO: అలుగు గండి పూడ్చివేత.. రాకపోకలు పునరుద్ధరణ

KMM: కూసుమంచి మండలం బీళ్ళచెరువులోని చెరువు అలుగు వద్ద ఏర్పడిన గండిని ఆదివారం ఇరిగేషన్, పంచాయతీ అధికారులు పూడ్చివేశారు. గత పది రోజులుగా కురుస్తున్న భారి వర్షాల కారణంగా అలుగు పొంగిపార్లి, అలుగు ప్రాంతంలో గండి పడింది. దీని కారణంగా బీళ్ళచెరువు చేగొమ్మ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికారులు గండిని పూడ్చి వేసి రాకపోకలను పునరుద్ధరించారు.