నేడు 2256 టిడ్కో ఇళ్లు అప్పగింత
NTR: విజయవాడ జక్కంపూడిలోని టిడ్కో ఇళ్లను సోమవారం 2256 మంది లబ్ధిదారులకు అప్పగించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్మాణం పూర్తయినా ప్రభుత్వాల మార్పుతో ఇన్నాళ్లూ ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం ఇళ్లకు రంగులు వేయించి, మౌలిక వసతులు కల్పించి పంపిణీకి సిద్ధం చేసింది. దీంతో ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లబ్ధిదారుల సొంత ఇంటి కల నేటితో నెరవేరనుంది.