చెత్త సేకరణ కేంద్రంలో పేకాట.. కేసునమోదు

చెత్త సేకరణ కేంద్రంలో పేకాట.. కేసునమోదు

SKLM :ఎల్.ఎన్.పేట మండలం కోవిలాం గ్రామంలో పేకాట శిబిరంపై శుక్రవారం దాడి చేశామని సరుబుజ్జిలి ఎస్సై బి.హైమావతి తెలిపారు. ఆమె మాట్లాడుతూ..గ్రామంలో చెత్త సేకరణ కేంద్రంలో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం ఆధారంగా అక్కడికి వెళ్లి పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం వారి నుండి రూ.9,430 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని తెలిపారు.