మాతమ్మ కొలుపులో పాల్గొన్న మాజీ మంత్రి రోజా

మాతమ్మ కొలుపులో పాల్గొన్న మాజీ మంత్రి రోజా

TPT: వడమాలపేట మండల పరిధిలోని బట్టి కండ్రిగ గ్రామంలో ఆదివారం మాతమ్మ కొలుపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి రోజా హాజరయ్యారు. ముందుగా ఆమెకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాతమ్మ కొలుపులో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.