'యోగా, హోమియోతోనే సంపూర్ణ ఆరోగ్యం'
SRPT: ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ.. హోమియోపతి వైద్యం, నిత్యం యోగా సాధనతోనే దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేసుకోవచ్చని పిలుపునిచ్చారు. జీవనశైలి మార్పులతోనే మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఆయన అన్నారు.