నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు

ASR: భూ ఆక్రమణల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అధికారులను హెచ్చరించారు. శుక్రవారం అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి అధ్యక్షతన ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. భీంపోలు పంచాయతీలో ఆక్రమణకు గురైన స్థలాన్ని, భూమి లేని స్థానిక గిరిజనులకు పంపిణీ చేయాలన్నారు.