బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.. జిల్లా ఉపాధ్యక్షుడు

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.. జిల్లా ఉపాధ్యక్షుడు

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన జానపద కళాకారుల సంఘం జిల్లా నాయకుడు నిమ్మల రాజు మాతృమూర్తి నిమ్మల రాజక్క ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సూరం వీరేందర్, శనివారం రాజు కుటుంబాన్ని పరామర్శించి, మనోధైర్యం కల్పించి, 50 కేజీల బియ్యం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఉన్నారు.