జిల్లా టీడీపీ అధ్యక్షుడు నియామకం

జిల్లా టీడీపీ అధ్యక్షుడు నియామకం

అన్నమయ్య: టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబును నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు సమాచారం. మాజీ ఎంపీ పాలకొండ్రాయుడు తనయుడైన ఆయన ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుదీర్ఘకాలంగా పార్టీలో కొనసాగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.