VIDEO: పుష్కరాల కోసం స్థల సేకరణ చేసిన ఎమ్మెల్యే
E.G: రానున్న గోదావరి పుష్కరాలు – 2027కు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులకు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సూచించారు. ఈ సందర్భంగా మంగళవారం టూరిజం అధికారులతో కలిసి కొవ్వూరు గోష్పాద రేవు నుంచి కుమారదేవం వరకు బోట్‌పై పర్యటించారు. ఈ మేరకు పుష్కరాల నిర్వహణకు స్థల సేకరణ చేశారు.