డ్రగ్స్ రహిత రాష్ట్రమే ధ్యేయం: అమిత్ షా
2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బీజేపీ పోరాడుతుందని అమిత్ షా ప్రకటించారు. పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం బీజేపీతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. గ్యాంగ్‌స్టర్ల అరాచకాలు, అప్పుల ఊబి, మత మార్పిడులు, అవినీతి వల్ల రాష్ట్రం కుప్పకూలిందని.. పంజాబ్ భవిష్యత్తు మారాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని షా పిలుపునిచ్చారు.