పెనుకొండలో మెడికల్ కాలేజీ ప్రారంభిస్తాం: మంత్రి

సత్యసాయి: పెనుకొండలో మెడికల్ కాలేజీ ఓపెన్ చేస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. శుక్రవారం నక్కలగుట్టలో సత్యకుమార్ మాట్లాడుతూ.. మంత్రి సవిత అభ్యర్థన మేరకు పెనుకొండలో మెడికల్ కాలేజీను 2026-27లో ప్రారంభిస్తామని తెలిపారు. గత పాలకులు మెడికల్ కాలేజీ నిర్వీర్యం చేశారన్నారు. నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మెడికల్ కాలేజీ ప్రారంభిస్తామన్నారు.