యూరియా కోసం రైతుల ఆవేదన

కృష్ణా: ఉంగుటూరులో యూరియా కోసం రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. సోమవారం ఉంగుటూరు గ్రామంలోని PACS షాపు వద్ద ఎరువుల కోసం పెద్ద సంఖ్యలో రైతులు పడిగాపులు కాశారు. సరఫరా లోపంతో గంటల తరబడి వేచి చూసినా యూరియా అందకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, పాలకులు సమస్యపై పట్టించుకోవడంలేదని రైతులు మండిపడ్డారు.