కాండం కుళ్లు తెగులుపై అప్రమత్తంగా ఉండాలి: ఏవో

W.G: వరిలో కాండం కుళ్లు తెగులుపై రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయాధికారి పి.రమేశ్ నాయుడు సూచించారు. గురువారం బొండాడలో తెగులు సోకిన వరి పొలాన్ని ఆయన పరిశీలించారు. తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే హెక్సాకోనాజోల్ లేదా వాలిడమైసిన్ 2.00 ml లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని రైతులకు సలహా ఇచ్చారు.