'బీట్ ద హీట్'పై అవగాహన కల్పించండి: కలెక్టర్

'బీట్ ద హీట్'పై అవగాహన కల్పించండి: కలెక్టర్

NLR: ప్రతినెల మూడో శనివారం జరిగే ‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ‘బీట్ ద హీట్’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని వేడిని తట్టుకునే మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందిని కోరారు. రూఫ్ గార్డెన్స్ ఏర్పాటు, చల్లదనానికి భవనాలపై కూల్ వైట్ పెయింటింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించడమే లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.