9 మందికి జరిమానా ఒకరికి జైలు శిక్ష
PDPL: రామగుండం పరిధిలో నిర్వహించిన డ్రంక్ & డ్రైవ్‌లో దొరికిన 10 మందిని గోదావరిఖని కోర్టులో హాజరు పరిచినట్లు ట్రాఫిక్ CI రాజేశ్వరరావు తెలిపారు. 9 మందికి ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున జరిమానా, ఒకరికి 3 రోజుల జైలు శిక్ష విధిస్తూ జడ్జి వెంకటేష్ దుర్వ తీర్పునిచ్చారని పేర్కొన్నారు. జైలు శిక్ష పడిన వ్యక్తిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించామన్నారు.