ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం

అనకాపల్లి: కోటవురట్లలో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది. విద్యుత్ స్తంభం కింద తుప్పు పట్టడంతో నేడో రేపో కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కొత్త స్తంభం వెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని అయితే సమీపంలో ఉన్న ఇంటి వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు విద్యుత్ సిబ్బంది తెలిపారు.