విజయవాడలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

విజయవాడలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

ఎన్టీఆర్: UPSC సివిల్స్ పరీక్షకు సిద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ క్లాసులలో జాయినయ్యే ఆసక్తి ఉన్న అభ్యర్థులు విజయవాడ అశోక్నగర్, పండరీపురం రోడ్ నం 8లో ఉన్న స్టడీ సర్కిల్ కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.