సీఎం చంద్రబాబుపై మాజీ స్పీకర్ విమర్శలు

శ్రీకాకుళం: ప్రపంచ పుణ్యక్షేత్రాల లో ఒకటైన తిరుపతి మహా పుణ్యక్షేత్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ స్వార్థం కోసం అని మాజీ సభాపతి, జిల్లా పార్లమెంటరీ పార్టీ ప్రతినిధి తమ్మినేని సీతారాం అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. లడ్డూ వివాదం వెనుక హెరిటేజ్‌కి లాభం చేకూర్చే దురాలోచన వుందని విమర్శించారు. దీనిపై సీబీఐతో గాని సిట్టింగ్ జడ్జితో గాని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.