'బడీడు పిల్లలను పాఠశాలకు పంపాలి'

'బడీడు పిల్లలను పాఠశాలకు పంపాలి'

ADB: బడిలో చదివే పిల్లలను వ్యవసాయ పనిలోకి కాకుండా పాఠశాలలకు పంపేలా చూడాలని క్లస్టర్ రిసోర్స్ పర్సన్ రాజేశ్వర్ అన్నారు. గురువారం రూరల్ మండలంలోని టేక్ డి గూడ పరిధిలో బడికి వెళ్లకుండా ఉన్న ముగ్గురు పిల్లలను గుర్తించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్య అందుతుందన్నారు.