VIDEO: హనుమాన్ శోభాయాత్రలో విషాదం
యూపీలోని ముజఫర్‌నగర్ జిల్లా ఖతౌలీలో హనుమాన్ జయంతి ఊరేగింపులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.