పునుగోడులో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్
ప్రకాశం: బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ఆదేశాల మేరకు కనిగిరి మండల అధ్యక్షుడు గంజి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో మండలం పునుగోడు గ్రామంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ సిద్ధాంతాలు, సేవా కార్యక్రమాలపై అవగాహన పొందారు.