VIDEO: తిరుమల ఛైర్మన్‌ను తొలగించాలని డిమాండ్
విశాఖపట్నంలో తిరుమల పవిత్రతను కాపాడే దిశగా, బి.ఆర్. నాయుడుని వెంటనే ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ 49వ వార్డులో ఉన్న శ్రీశ్రీశ్రీ వైభవ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె. కె. రాజు, తదితరులు పాల్గొన్నారు.