మహిళల లైంగిక వేధింపులపై అవగాహన

మహిళల లైంగిక వేధింపులపై అవగాహన

VZM: వాల్తేరు డీఆర్ఎం లలిత్ బోహ్ర ఆదేశాలతో కొత్తవలస రైల్వే స్టేషన్‌లో పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గురువారం సబిత మంజూధర్ అవగాహన కల్పించారు. మొత్తం నాలుగు కమిటీలు నియమించినట్లు తెలిపారు. వారంతా పని ప్రదేశాలకు వెళ్ళి మహిళలకు అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. పని ప్రదేశాల్లో లైంగిక వేదింపులు నివారణ చట్టం-2013 నిబంధనలపై తెలియజేస్తామన్నారు.