నిరుపేదలకు రంజాన్ కిట్లు అందజేత

ఆదిలాబాద్: రంజాన్ మాసం సందర్భంగా ఆదిలాబాద్‌లోని షాదీఖాన, భుక్తపూర్, న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ, సుభాష్ నగర్, బంగారిగూడ కాలనీల్లో నిరుపేద ముస్లిం కుటుంబాలకు సామాజిక కార్యకర్త ముడుపు మౌనిశ్ రెడ్డి రంజాన్ కిట్లను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అజిజ్, షఫీ, ఆశన్న యాదవ్, మోరేష్, జహీర్, సురేందర్ రెడ్డి, సాగర్ రెడ్డి, తదితరలున్నారు.