'స్మార్ట్ కార్డుతో రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు'

'స్మార్ట్ కార్డుతో రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు'

కోనసీమ: కూటమి ప్రభుత్వం నూతనంగా పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని మాజీ సర్పంచ్ నాగిరెడ్డి వెంకటరత్నం పేర్కొన్నారు. ఆలమూరు మండలం చెముడులంక గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.