అమరజీవి త్యాగం.. మరువదు తెలుగు జాతి!
తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు. నేడు ఆయన వర్ధంతి. మద్రాసు నుంచి విడిపోయి, ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ 58 రోజుల పాటు కఠోర నిరాహార దీక్ష చేసి అసువులు బాసారు. ఆయన త్యాగఫలమే నాటి ఆంధ్ర రాష్ట్రం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యుడు, గొప్ప గాంధేయవాది అయిన ఆ 'ఆంధ్రా జాతిపిత'కు ఘన నివాళులు.