'ఆయనతో కలిసి ప్రయాణించడం నా అదృష్టం'
ప్రకాశం: ఒంగోలులో ఆదివారం సత్యసాయిబాబా జయంతి వేడుకలలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భగవాన్ శ్రీ సత్యసాయిబాబాతో కలిసి ప్రయాణించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. 40 సంవత్సరాల క్రితం విమానంలో ఇద్దరం పక్కన పక్కనే కూర్చొని ప్రయాణించామని, తర్వాత ఆయన కారులో ఆశ్రమాలు చూశానని గుర్తు చేసుకున్నారు.